ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రామిస్..మళ్ళీ పాత ట్రీట్ ఇస్తానంటున్న దర్శకుడు.!

ఏది ఏమైనప్పటికీ మాత్రం ఓ హీరో స్టార్టింగ్ కెరీర్ నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిమానులు అనుకుంటారు. అయితే ఈ లిస్ట్ లో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి సినిమాలు చేసేవాడు ఇప్పుడు ఏ తరహా సినిమాలు చేస్తాడో చూస్తున్నాం. 

అయితే ఈ క్రమంలో ప్రభాస్ ఫాన్స్ అయితే ఒక పదేళ్ల కితం ఉన్న ప్రభాస్ ని బాగా మిస్ అవుతున్నారు. ముఖ్యంగా బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, డార్లింగ్ సినిమాల్లో కనిపించిన ఎనర్జిటిక్ డార్లింగ్ దూరం అవ్వడంతో ఆ ప్రభాస్ కోసం వారు ఎదురు చూస్తున్నారు. 

మరి ఆ ప్రభాస్ ను నేను ఇప్పుడు అందిస్తానని దర్శకుడు మారుతీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రామిస్ ఇస్తున్నాడు. నా సినిమాతో అయితే మెయిన్ గా చాలా కాలం నుంచి ప్రభాస్ నుంచి మిస్ అవుతున్న ఎలిమెంట్స్ ని ఇచ్చేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నానని. మా టీం అంతా కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నామని క్రేజీ అప్డేట్ ని అందించాడు. 

దీనితో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. మరి తాను ఎంతవరకు చెప్పిన మాట పై నిలబడతాడో చూడాలి. మారుతీ అయితే ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుంది మరి ప్రభాస్ తో అవకాశం ఎంతవరకు సద్వినియోగం చేస్తాడో చూడాలి.