Coffee Side Effects: కాఫీ ఎక్కువగా తాగే వారు చేసే పొరపాట్లు ఇవే… వీటివల్ల ఈ సమస్యలు తప్పవు..!

Coffee Side Effects: చాలామందికి ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే రోజు గడవదు. చాలా మంది కాఫీకి బాగా అలవాటు పడి సమయం,సందర్భం లేకుండా ఎక్కువగా తాగుతుంటారు. కాఫీ తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొందరు అంటే, కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అని కొందరి అభిప్రాయం. అయితే ఏ పదార్థం అయిన మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. కాఫీ అమితంగా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.

చాలామందికి ఉదయం లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ప్రతిరోజు ఇలా ఖాళీ కడుపుతో కాఫీ తాగటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. దీని మూలంగా స్థూలకాయం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఖాళీ కడుపుతో కాఫీ తాగక పోవటం శ్రేయస్కరం.

ఉదయం ,సాయంత్రం ఖచ్చితంగా కాఫీ తాగే అలవాటు ఎక్కువ మందికి ఉంటుంది. సాయంత్రం పూట వీలైనంత తొందరగా కాఫీ తాగటం మంచిది. నిద్ర పోవటానికి 2,3 కాఫీ తాగడం వల్ల రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. చాలామందికి నిద్రకు ముందు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు మార్చుకోవటం ఆరోగ్యానికి మంచిది.

కాఫీ లో కెఫిన్ ఎక్కువగా ఉండటం వల్ల అది సహజంగా నిద్ర మేల్కొలిపే స్వభావం కలిగి ఉంటుంది. అయితే చాలా సెన్సిటివ్ గా ఉన్న వారు కాఫీ ఎక్కువ తాగటం వల్ల శరీరం లో బీపీ, షుగర్ వంటి సమస్యలు అధికమై గుండె సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది, కానీ అధిక మోతాదులో కాఫీ తాగటం మంచిది కాదు.