ఏపీలో రోజు రోజుకు బలంగా మారుతున్న వైసీపీని కూల్చడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడనేది జగమెరిగిన సత్యం.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్న వార్త కుడా.. అయితే ఈ ఉప ఎన్నికల నేపధ్యాన్ని వీరలెవల్లో వాడుకుని అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వెయ్యాలని బాబు ప్రణాళిక అంటున్నారు విశ్లేషకులు.. ఇకపోతే ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ అప్రమత్తమైంది.
ఇదిలా ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పదిహేను నెలల కాలంలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇదే కావడంతో వైఎస్ జగన్ కూడా పక్కా ఏర్పాట్లతో ఉప ఎన్నికల బరిలో దిగి మొన్నటి ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ సాధించి టీడీపీతో పాటుగా ఇతర ప్రతిపక్షాలు నోళ్ళు మూయించటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట.. ఇదే సమయంలో ఇక్కడ బీజేపీ కూడా పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు.. కాగా 2024 ఎన్నికలకు ఈ బైపోల్స్ ని వామప్ మ్యాచ్ గా భావిస్తున్న బీజేపీ, కచ్చితంగా పోటీకి నిలబడే అవకాశాలున్నాయని అంటున్నారు.. పైగా అది మోడీకి కావాల్సిన ఎంపీ సీటు..
ఇంతటి వార్ ఉన్న నేపధ్యంలో పంక్చర్ అయిన సైకిల్‌ను తోసుకుంటూ ఆయాసపడి పోటీ చేయడం ఎందుకు, నలుగురిలో ఓడిపోయి నవ్వులపాలవడం ఎందుకని ఆలోచించిన టీడీపీ అధినేత బాబు గారు ఈ ఉప ఎన్నికలో బీజేపీ అడిగిన అడగకపోయినా ఫుల్ మద్దతు ఇచ్చేయాలని ఫిక్సయ్యారంట. ఇలా బీజేపీ, జనసేనలకు తోడుగా టీడీపీ కూడా చేరితే వైకాపాను ఇరకాటంలో పెట్టోచ్చనేది బాబు చేసుకుంటున్న ప్రణాళిక.. ఒకవేళ బీజేపి గనుక ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ క్రెడిట్‌ట్లో తనకు కొంత ఫలితం దక్కి అమిత్ షా, మోదీల ద్వారా మళ్లీ టీడీపీ నీ గాడిలో పెట్టవచ్చనే ఆలోచనలో ఉన్నాడట.. ఇంతకు ఆకాశంలో మేడలు కట్టుకుంటున్న బాబుగారి ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి..