‘పుష్ప’ ఫస్ట్ విలన్ గా ఊహించని లుక్ లో సునీల్.!

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తన సినిమాల్లో పాత్రలను ఎంత ప్రత్యేకంగా సాలిడ్ గా ఉంటాయో గత సినిమాల్లో ఇది వరకే చూసాం. హీరో నుంచి విలన్ వరకు ఓ రేంజ్ లో సుకుమార్ తన పాత్రలను ప్రెజెంట్ చేస్తారు. ఇక ఇప్పుడు తన భారీ సినిమా “పుష్ప” లో కూడా అల్లు అర్జున్, రష్మికా మందన్నా లు నుంచి నటుడు ఫహద్ ల వరకు ఊహించని లుక్స్ నే సిద్ధం చేసి చూపించారు.

మరి ఇప్పుడు ఈ సినిమా మొదటి భాగంలో విలన్ గా నటిస్తున్న సునీల్ ని మంగళం శ్రీను గా పరిచయం చేస్తూ తన స్టన్నింగ్ లుక్ ని రివీల్ చేశారు. చాలా పెద్ద మనిషి పాత్రలో ఏదో ఊరి పెద్ద అన్నట్టుగా సాలిడ్ లుక్ లో చూపిస్తున్నారు. ఇక ఇది సినిమాలో పుష్ప తో ఎలా డీల్ అయ్యి ఉంటుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి బ్యానర్ లో నిర్మాణం అందిస్తున్నారు.