షాకింగ్ బజ్ : “పుష్ప” రిలీజ్ పై ఊహించని ట్విస్ట్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా ప్రెజెంట్ చేస్తున్నాం అంటూ తన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప” ని మేకర్స్ అనౌన్స్ చేశారు. మొదట పాన్ ఇండియా సినిమాగా దీనిని అనౌన్స్ చేయకపోయినా తర్వాత మాత్రం దీనిని హిందీలో సహా ఇతర సౌత్ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న బన్నీ పాన్ ఇండియా ఎంట్రీ తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో కన్ఫర్మ్ అయ్యినట్టు ఫిక్స్ అయ్యింది.

కానీ ఇప్పుడు షాకింగ్ బజ్ ఏమిటంటే ఈ సినిమా హిందీ రిలీజ్ నుంచి డ్రాప్ అవ్వబోతుందట. ఇంకా దీనిపై అధికారిక అప్డేట్ లేదు కానీ ట్రస్ట్డ్ సినీ వర్గాలు నుంచి సమాచారం ప్రకారం పుష్ప హిందీ రిలీజ్ ఆపుకుంటున్నట్టే చెబుతున్నారు. ఒకవేళ ఇది నిజం అయితే మరి ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. ఇక దీనిపై ఓ అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇటీవల మేకర్స్ నుంచి కూడా ఈ సినిమాని పాన్ ఇండియన్ అప్డేట్స్ తరహాలో ఇవ్వడం కూడా ఆపేశారు. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.