Samantha: పెళ్లికి ముందే విడాకులు తీసుకుంటానని చెప్పిన సమంత.. ట్వీట్ వైరల్!

Samantha: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారం గురించి పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక జంట విడాకుల గురించి వార్తల్లో నిలుస్తున్నారు. గత ఏడాది టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడం ఇప్పటికీ అభిమానులను కలిచివేస్తోంది. వీరి విడాకుల విషయం గురించి మర్చిపోకముందే మరొక స్టార్ హీరో హీరోయిన్ విడాకులు తీసుకుని విడిపోవడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.ఇదిలా ఉండగా సమంత విడాకుల గురించి ప్రస్తుతం ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే సమంత పెళ్లి కాకముందే విడాకుల గురించి ప్రస్తావన తీసుకువచ్చారు. 2013వ సంవత్సరంలో విడాకుల గురించి సమంతను ఒక నెటిజన్ ప్రశ్నించగా సమంత తనదైన శైలిలో సమాధానం చెబుతూ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు సమంత పై దారుణంగా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ సమంత విడాకులపై ఎలా స్పందించారు అనే విషయానికి వస్తే…

విడాకుల పై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నను ఒక నెటిజన్ అడగగా…అందుకు సమంత సమాధానం చెబుతూ మీరు చూస్తూ ఉండండి నేను కూడా పెళ్లి చేసుకుని అనంతరం విడాకులు తీసుకుంటాను. విడాకులు తీసుకున్న తర్వాత నీతో కలిసి డాన్స్ చేస్తాను అంటూ సమాధానం చెప్పారు. ఇలా విడాకుల గురించి సమంత చెప్పిన విధంగానే వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఈ మాత్రం దానికి వివాహం చేసుకోవడం ఎందుకు అంటూ సమంత పై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.