Samantha: పుష్ప ప్రమోషన్ లో సమంత కనిపించకపోవడానికి కారణం అదేనా?

Samantha: సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్స్ ద్వారా కూడా సమంత ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైందని పుష్ప సినిమా ద్వారా నిరూపించారు. పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా ఊహూ అంటావా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి విశేషమైన ప్రేక్షకాదరణ తగ్గించుకుంది.ఈ సినిమాకు ఏ స్థాయిలో ప్రశంసలు వచ్చాయో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదురయ్యాయని చెప్పవచ్చు.

ఐటమ్ సాంగ్ లో నటించడం కోసం సమంత ఏకంగా కోటిన్నర రూపాయలు పారితోషకం తీసుకుందని సమాచారం. ఇకపోతే సమంత సినిమా ప్రమోషన్ అంటే ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. మరి సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సమంత ఎక్కడ కనిపించకపోవడం గమనార్హం. అసలు సమంత పుష్ప సినిమా ప్రమోషన్ లో కనిపించకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..

పుష్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కేవలం అతి తక్కువ సమయం ఉంది. కేవలం మూడు నాలుగు రోజులు మాత్రమే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి అనంతరం సినిమాను విడుదల చేశారు. ఇక ఆ సమయంలో సమంత కొచ్చిలో ఉన్నారని ఆ కారణం వల్లే పుష్ప ప్రమోషన్స్ కు హాజరు కావడం లేదని సమాచారం. ఈమె ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వచ్చారు.