Samantha: సినీనటి సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. గతదశాబ్ద కాలం పైగా ఈమె ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఇటీవల కాలంలో సమంత తన వ్యక్తిగత విషయాలు అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలను కాస్త తగ్గించారు . ఇక ఇప్పుడిప్పుడే సమంత తిరిగి కోలుకోవడంతో ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు ప్రస్తుతం ఒకవైపు హీరోయిన్ గా సినిమాలు వెబ్ సిరీస్ లో చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా మారిపోయారు.
ప్రస్తుతం సమంత శుభం అనే సినిమాని నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత డైరెక్టర్ రాజ్ ప్రేమలో పడ్డారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు వీరి రిలేషన్ పై ఎక్కడ స్పందించలేదు అయితే సహజంగా సమంత తనకు ఇండస్ట్రీలో అత్యంత ఆప్తుడు అయినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
సమంతకు ఇండస్ట్రీలో సింగర్ చిన్మయి చాలా మంచి స్నేహితురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈమె భర్త నటుడు రాహుల్ రవీందర్ కూడా సమంతకు మంచి స్నేహితుడు వీరంతా ఒక కుటుంబ సభ్యులుగా ఉంటారు. అయితే తాజాగా సమంత నటుడు రాహుల్ రవీందర్ గురించి మాట్లాడారు. నేను అనారోగ్యానికి గురై ఇక నా జీవితం ముగిసింది అని భయపడుతున్న టైంలో రాహుల్ నా పక్కన ఉన్నాడని.. హాస్పిటల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నా బాగోగులు చూసేవాడని.. నన్ను డిప్రెషన్ లోకి వెళ్లకుండా చేసేవాడని.. తన పనులన్నీ మానేసుకుని ఎక్కువ సమయం నాకోసమే కేటాయించాడని వివరించింది.
మా ఈ బంధానికి నేను ఎలాంటి పేరు పెట్టలేదు అతను నాకు స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్తసంబంధీకుడు ఇలా ఏ పేరుతోను పిలవలేనని వివరించింది. వీళ్లిద్దరి మధ్య ఉన్న ఈ ఎమోషనల్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఇక వీరిద్దరూ తమిళంలో ఓ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే తెలుగులో కూడా యూటర్న్ అనే సినిమాలో సమంత రాహుల్ రవీందర్ కలిసి నటించారు.