‘RRR’ టీజర్ : ఒక్క మాట కూడా లేకుండా దుమ్ము లేపబోతుందా?

ప్రెజెంట్ టాలీవుడ్ బాలీవుడ్ అన్ని వర్గాల్లో కూడా మోస్ట్ అవైటెడ్ ఎవర్ టీజర్ ట్రిపుల్ ఆర్(RRR) కోసమే చర్చ నడుస్తుంది. ఇండస్ట్రీలో పలు కీలక సినీ వర్గాలు ఈ 29నే ఈ టీజర్ ట్రీట్ ఉంటుంది అని గట్టిగా చెబుతున్నారు కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి ఉలుకూ లేదు.

సరే ఇది పక్కన పెడితే అసలు ఈ వచ్చే టీజర్ ఎలా ఉంటుంది అన్న దానిపై లేటెస్ట్ సమాచారం వినిపిస్తుంది. యోధులు కొమురం భీం, అల్లూరి పాత్రలు చేసిన ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ లు ఇద్దరూ కూడా ఈ టీజర్ లో ఉంటారట కానీ ఇందులో ఒక్క డైలాగ్ కూడా ఉండదని తెలుస్తుంది.

బహుశా ఇద్దరివీ ఉండవేమో కానీ టీజర్ లో మాత్రం ఒక్క డైలాగ్ కూడా లేకుండా కంప్లీట్ ఫుల్ యాక్షన్ లోనే ఉంటుందట.. రాజమౌళి అదిరే సీక్వెన్స్ లు అన్నిటితో ఈ టీజర్ ని నింపేసారని చూడడానికి దుమ్ము లేచే లెవెల్లో ఉంటుందని సినీ వర్గాల్లో మాట. మరి జక్కన్న ఈ టీజర్ ని ఎలా చెక్కారో తెలియాలి అంటే ఆగక తప్పదు.