‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ బీభత్సం.. ఆ భయం తొలగిపోయినట్టేనా.?

 

‘ఆర్ఆర్ఆర్’ సినిమాని థియేటర్లలో విడుదల చేసే పరిస్థితి వుంటుందా.? కరోనా మూడో వేవ్ అంటున్నారు, సినిమా విడుదలయ్యేదెలా.? అంటూ చాలా అనుమానాలు నిన్న మొన్నటిదాకా వినిపించాయి, ఇప్పటికీ వినిపిస్తూనే వున్నాయి. ఇంతలోనే, ‘ఆర్ఆర్ఆర్’ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయ్.

పీవీఆర్ ఛెయిన్‌తో టై అప్, ఆ వెంటనే గ్లింప్స్ రిలీజ్.. వెరసి ప్రమోషన్లు షురూ చేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఇక నుంచి రోజువారీ అప్డేట్స్ అన్నట్లే వుంటుందట ప్రమోషన్స్ తీరు. గ్లింప్స్ అయితే అదిరిపోయింది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. అన్న మాట ప్రతిసారీ రాజమౌళి సినిమా గురించి వినిపిస్తుంటుంది.. ఇప్పుడూ అదే జరుగుతోంది.

అయితే, మూడో వేవ్ దేశంలో.. ప్రపంచంలో మొదలైపోయిందని అంటున్నారు. అదొక్కటే కొంత ఆందోళన కలిగిస్తోంది. సంక్రాంతి కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లన్నీ దాదాపు పూర్తి సామర్థ్యంతో రన్ అవుతున్నాయి.

ప్రేక్షకులు నెమ్మది నెమ్మదిగా మళ్ళీ థియేటర్లకు అలవాటు పడుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్ కూడా సినీ పరిశ్రమకి తీపి కబుర్లే చెబుతోంది ఇటీవలి కాలంలో. సో, భయాలు పక్కన పెట్టి, ‘ఆర్ఆర్ఆర్’ మేనియాని.. విడుదలయ్యవరకూ ఇలాగే కొనసాగించాల్సిందే.