ప్రముఖ హీరోయిన్ దిశా పటానీ లో దుస్తులకి బ్రాండ్ అంబాసిడర్. అడపా దడపా ఆ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తూ, హాట్ హాట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే, అప్పుడు లేని అభ్యంతరాలు.. రష్మిక విషయంలో ఎందుకొస్తున్నాయి.? అసలు రష్మిక అండర్ వేర్ వివాదంలో ఎందుకు ఇరుక్కుంది.?
సెలబ్రిటీలు ఆయా బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడం కొత్తేమీ కాదు. సబ్బులూ, చాక్లెట్లూ.. ఇలా దేన్నయినా ప్రమోట్ చేస్తూ, ప్రకటనల్లో కనిపిస్తుంటారు. అలాగే, రష్మిక కూడా ఓ అండర్ వేర్ ప్రకటనలో నటించింది. ఆమె నేరుగా మహిళల అండర్ వేర్ గురించి ప్రకటనలో కనిపిస్తే, అదెంత వివాదం అయ్యి ఉండేదో.
బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ నటించిన ఓ అండర్ వేర్ ప్రకటనలో రష్మిక కూడా నటించింది. విక్కీ కౌషల్ అండర్ వేర్‌ని చూసి ఆశ్చర్యపోతుంది రష్మిక. అలా ఆశ్చర్యపోవడమే రష్మికను వివాదాల్లోకి లాగింది. డబ్బు కోసం ఇంతలా దిగజారిపోవాలా.? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
కొందరు హీరోయిన్లు కండోమ్ ప్రకటనల్లోనూ నటిస్తుంటారు. అప్పుడు లేని అభ్యంతరం రష్మిక యాడ్ విషయంలో ఎందుకొచ్చినట్లు.? ఇదో టైప్ ఆఫ్ పబ్లిసిటీ అనుకోవాలా.? రష్మిక అభిమానులు మాత్రం, ఈ యాడ్‌లో తమ అభిమాన నటిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు.