రాదేశ్యామ్’లో ఒక విషాదం తప్పనిసరా

Radheshyam should be a great lovestory

Radheshyam should be a great lovestory

ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో భిన్నమైన సినిమా అంటే ‘రాధేశ్యామ్’ అనే అనాలి. ప్రభాస్ తన శైలికి వ్యతిరేకంగా పూర్తిస్థాయి లవ్ జానర్లో చేస్తున్న సినిమా ఇది. ప్రేమ, పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. మోషన్ పోస్టర్ కంటెంట్ చూస్తే పలు జన్మల్లో జరిగే కథని ఇట్టే అర్థమవుతుంది. లేటెస్ట్ గా వినిపిస్తున్న గాసిప్స్ మేరకు కథలో విషాదం ఉంటుందట. అంటే ప్రేమలో ఉన్న హీరో హీరోయిన్లలో ఒకరు చనిపోతారట. చనిపోయాక తర్వాతి జన్మల్లో కలుసుకోవడమే కథట.

అయితే ఇందులో ఎవరు మరణిస్తారు.. అయితే హీరో హీరోయిన్లలో ఎవరు మరణిస్తారు, ఎలా మరణిస్తారు, తిరిగి వచ్చే జన్మల్లో అనేదే కథలో కిక్. అందుకే ఈ సినిమా ఒక ప్రయోగం అంటున్నారు. ప్రయోగం సక్సెస్ అయితే సినిమా గుర్తిండిపోయే సినిమా అవుతుందని కూడ అంటున్నారు. నిజానికి గొప్ప గొప్ప ప్రేమకథలన్నీ విషాదాంతాలే కాబట్టి ఆ ఎమోషన్ నుండి కథను రూపొందించుకుని ఉండొచ్చు డైరెక్టర్. ఇక అభిమానులైతే ఇవన్నీ పక్కనపెట్టి సినిమా టీజర్ వదలమని, రిలీజ్ వాయిదాపడకుండా పనులు జరిగేలా చూడాలని అంయున్నారు.