The Paradise: టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటు తాను హీరోగా చేసిన సినిమాలు హిట్ అవుతుండగా మరోవైపు నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమాలు సైతం సూపర్ హిట్ అవుతున్నాయి. అలా ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు నాని. ఇది ఇలా ఉంటే నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవి ది ప్యారడైజ్.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయినా అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. షర్ట్ లేకుండా కత్తి పై చేయి పెట్టుకుని సిగరేట్ కాలుస్తూ ఉన్న మోహన్ బాబు లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఎప్పుడూ కనిపించని ఒక సరికొత్త లుక్ లో మోహన్ బాబు కనిపిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన లుక్ కి సంబంధించిన ఫొటోస్ నచ్చిన వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ ని చూసిన అభిమానులు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. మోహన్ బాబు కొత్తగా కనిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేసున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రిలీజ్ కానుంది. 1980ల కాలంలో హైదరాబాద్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
