‎Vadde Naveen: రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్.. సినిమా ఏదో తెలుసా?

‎Vadde Naveen: తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటీ టాలీవుడ్ స్టార్ హీరో వడ్డే నవీన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. మొదట కోరుకున్న ప్రియుడు సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ రెండో సినిమా పెళ్లితో పెద్ద హిట్‌ ను అందుకున్నారు. ఆ తరువాత మనసిచ్చి చూడు, స్నేహితులు, చెప్పాలని ఉంది, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి పలు చాలా సినిమాలలో నటించాడు.

‎వడ్డే నవీన్‌ చివరగా 2016లో ఎటాక్‌ చిత్రంలో కనిపించాడు. కాగా నవీన్ వెండితెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అతడు బిగ్‌స్క్రీన్‌పై రీఎంట్రీ ఇస్తున్నాడు. వడ్డే క్రియేషన్స్‌ అంటూ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్‌లోనే హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి త్రిమూర్తులు అని టైటిల్‌ ని కూడా ఫిక్స్‌ చేశాడు. ఆగస్టు 9 రాఖీ పండగ సందర్భంగా త్రిమూర్తులు నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో వడ్డే నవీన్‌ ఖాకీ చొక్కా ధరించి, లాఠీ పట్టుకుని సరదాగా నవ్వుతూ కనిపిస్తున్నారు.

https://twitter.com/vaddecreations/status/1954120973415858193?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1954120973415858193%7Ctwgr%5Ed86345d809eea4cfd7754dbd1d5fb25b8eab2e74%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fvadde-naveen-transfer-trimurthulu-first-look-out-now-vm-977427.html

‎రాశీ సింగ్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. కమల్‌ తేజ నార్ల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల అయిన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్గా స్పందన లభిస్తోంది. మరి చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో నవీన్ కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి మరి. ఆ పోస్టర్ వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్లు చేస్తూ సినిమా కోసం వెయిటింగ్ నవీన్ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.