రావణ్, జానకి అయ్యిపోయారు ప్రభాస్ ఒక్కడే మిగిలాడు ఇక!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు అనేక పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే వీటిలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో తీస్తున్న భారీ మైథలాజికల్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుని పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ అంతా అయ్యిపోవస్తుండగా గత కొన్ని రోజులు కితమే సైఫ్ అలీఖాన్ తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేసేయగా ఇప్పుడు ఈరోజుతో ఈ సినిమాలో సీతగా నటిస్తున్న కృతి సనన్ తన పాత్ర ని కంప్లీట్ చేసేసినట్టుగా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా సైఫ్ లానే తనకి కూడా కేక్ చేయించి వీడ్కోలు చెప్పారు.

ఇక వీరిద్దరూ అయ్యాక మిగిలి ఉంది ప్రభాస్ చేస్తున్న రాముని పాత్రే అని చెప్పాలి. ఈ రోల్ పై షూట్ చేసే సీన్స్ ఇంకా మిగిలి ఉన్నాయట. బహుశా ఇది వచ్చే వారానికల్లా కంప్లీట్ అయ్యిపోనున్నట్టు టాక్. అలానే ప్రభాస్ బర్త్ డే కానుకగా కూడా రాముని లుక్ రిలీజ్ అవుతుందని బజ్ కూడా ఉంది మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది