ఇండస్ట్రీ టాక్ : ఆ సినిమాలో ఊహించని ప్రభాస్ ని చూడబోతున్నమా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ పాన్ ఇండియన్ సినిమాలు అలాగే పాన్ ఆసియా, వరల్డ్ సినిమాలు తో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇక వీటిలో ప్రస్తుతం ఆన్ షూట్ లో ఉన్నవి మాత్రం బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో తెరకెక్కిస్తున్న “ఆదిపురుష్” ఇంకా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మాస్ సినిమా “సలార్” చేస్తున్నాడు.

మరి వీటిలో సలార్ నుంచి ప్రభాస్ ఎలా ఉంటాడో ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది కానీ ఆదిపురుష్ సినిమా నుంచి మాత్రం ప్రభాష్ లుక్ ని ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. షూట్ స్పాట్ లో నార్మల్ గానే కనిపించే ప్రభాస్ రామాయణంలో రామునిగా ఆశ్చర్య పరచనున్నాడని తెలుస్తోంది. మరి మనం చూసిన మనకు తెలిసిన నీలి మేఘ శ్యాముడిలా ప్రభాస్ కనిపిస్తాడా లేక కొత్తగా ఓంరౌత్ చూపించబోతున్నాడా అన్నది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.