షాకింగ్ బజ్ : పవన్ మరో సంచలన డెసిషన్ తీసుకోబోతున్నాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా సినిమాలను వరుసగా చేపట్టి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. అంతేకాకుండా రెండేళ్లకు ఓ సినిమా కంప్లీట్ చేసే పవన్ ఇప్పుడు పరిస్థితులు రీత్యా ఏడాదికి రెండు సినిమాలు కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు.

అయితే గతంలో పవన్ పూర్తిగా సినిమాలకు స్వస్తి చెప్పి మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. కానీ మళ్లీ వచ్చారు. మరి మళ్లీ ఇప్పుడు పవన్ ఇదే తరహా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో అంతర్గత సమాచారం. పవన్ ఇప్పుడు ఓకే చేసిన సినిమాలు మినహా ఇక మరో ఏ సినిమాకి కూడా ఓకే చెప్పకూడదు అని షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట.

అలాగే వీటిలో సురేందర్ రెడ్డి తో ప్రాజెక్ట్ కొంత కాలం వాయిదా వేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాదికి 2022 పూర్తయ్యే సరికి సినిమాలు అన్నీ కంప్లీట్ చేసేసి అప్పుడికి కూడా పాలిటిక్స్ లో చూరుగ్గానే ఉంటూ ఆ తర్వాత పూర్తిగా పాలిటిక్స్ పై దృష్టి పెట్టాలి అనేది పవన్ ఆలోచన అట.. మరి ఇందులో ఎంతమేర నిజం ఉందో అన్నది తెలియాల్సి ఉన్నది.