పవిత్ర లోకేష్ కి నరేష్ తో ఉన్న సంబంధం ఏంటి..? పవిత్ర భర్తకి ఈమె మొదటి భార్య కాదా..?

సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేవారు కూడా మంచి గుర్తింపు పొందారు. అటువంటి వారిలో పవిత్ర లోకేష్ కూడా ఒకరు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన పవిత్ర లోకేష్ సీరియల్స్ లో కూడా నటించింది. తర్వాత రవితేజ హీరోగా నటించిన దొంగోడు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన పవిత్ర హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ తల్లిగా నటించిన ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం కూడా లేకపోలేదు.

నటుడు నరేష్ తో గత కొంతకాలంగా పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి వీరిద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు స్వామీజీని కలవటానికి మహాబలిపురం వెళ్లారు. దీంతో వీరిద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పటికే నరేష్ ఫ్యామిలీ ఫోటోలో కనిపించిన పవిత్ర .. ఇలా నరేష్ తో కలిసి స్వామీజీని కలవటానికి వెళ్లడంతో వీరి పెళ్ళి వార్తలలో నిజం ఉందని నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆమె మొదటి భర్త ఎవరు ? మొదటి భర్తతో విడాకులు తీసుకుందా? అన్న విషయం గురించి సెర్చింగ్ మొదలుపెట్టారు.

పవిత్ర మొదట కన్నడ సీరియల్ నటుడు సుచేద్ర ప్రసాద్ ని 2007లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు. అయితే పవిత్ర భర్త అప్పటికే కన్నడ నటి మల్లికా ప్రసాద్‌ను ప్రేమించి 2002 లో పెళ్లి చేసుకున్నారు. కానీ 2006 లో ఆమెకి విడాకులు ఇచ్చి 2007 లో పవిత్రని పెళ్ళి చేసుకున్నాడు. దీంతో పవిత్ర తన భర్తకి రెండో భార్య. ఇదిలా ఉండగా కొంతకాలంగా నరేష్ లో సహజీవనం చేస్తున్న పవిత్ర తన మొదటి భర్త నుండి విడాకులు తీసుకుందా? లేదా? అన్న విషయం గురించి ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈమె నరేష్ ని వివాహం చేసుకోవటానికి సిద్దమయింది అంటూ వినిపిస్తున్న వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.