చేతిలో కర్ర పట్టుకుని నడుస్తున్న నిత్యా మీనన్.. అసలు ఏం జరిగిందంటే..?

హీరోయిన్ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమా ద్వార టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిత్యామీనన్ ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో పలు సినిమాలలో నటించిన ఈ అమ్మడు తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగులో ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో ఆయనకు జోడిగా నటించింది. తాజాగా ఈ అమ్మడు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వెబ్ సిరీస్ జూలై 2వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవల ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిత్యామీనన్ చేతిలో కర్ర పట్టుకుని నడుస్తూ రావటం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆమె నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఇద్దరు బాడీ గార్డ్స్ సహాయంతో స్టేజి పైకి వచ్చింది. అయితే నిత్యా మీనన్ కి ఏం జరిగిందని అక్కడున్న వారందరూ ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో నిత్యా మీనన్ మాట్లాడుతూ తన పరిస్థితి ఇలా మారటానికి గల కారణం చెప్పుకొచ్చింది.

నిత్యా మీనన్ మాట్లాడుతూ…ఈ వెబ్ సిరీస్‌లో నేను ఎల్బో క్రచ్‌తో నటించాను. అయితే నాకు నిజ జీవితంలోనూ ఇప్పుడు అదే జరిగింది. రెండు రోజుల క్రితం మెట్ల మీద నుండి జారీ పడ్డాను. అప్పటినుండి ఎల్బో క్రచ్‌తో ఇబ్బంది పడుతున్నా..అంటూ తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో నటించిన రేవతి గారి గురించి మాట్లాడుతూ.. ఆమెని చూస్తుంటే ఇంట్లో మనిషిలా ఉంటారు. మా అమ్మ కూడా రేవతి మేడంలా ఉంటారు..’ అంటూ నిత్యా మీనన్ చెప్పుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్ తో పాటు నరేష్, రేవతి, అభిజిత్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, మాళవిక నాయర్, సుహాసిని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.