మీరు సింగిలేనా అంటూ నిహారికను వింత ప్రశ్న అడిగిన నెటిజన్.. నిహారిక సమాధానం ఇదే!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెర కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఇండస్ట్రీకి పరిచయమై అనంతరం హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. అయితే హీరోయిన్ నిహారిక సక్సెస్ కాకపోవడంతో వెబ్ సిరీస్ ల వైపు పయనించారు.ఇలా వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న నిహారిక గత రెండు సంవత్సరాల క్రితం జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వైవాహిక జీవితంలోకి స్థిరపడిన తర్వాత పూర్తిగా నిహారిక సినిమాలకు దూరమయ్యారు.

ఈ క్రమంలోనే నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. వివాహమైన తర్వాత నిహారిక పలు వివాదాస్పద సంఘటనల వల్ల సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఈమె పబ్బులో పోలీసులకు అడ్డంగా దొరికిపోవడంతో నెటిజన్లు అప్పటినుంచి నిహారికను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నిహారిక ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ కావడమే కాకుండా పెద్ద ఎత్తున నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతుంది.

ఇకపోతే తాజాగా నిహారిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు.ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇకపోతే ఒక నెటిజన్ తెలిసి అడిగారో తెలియక అడిగారో తెలియదు కానీ.. నిహారికను ప్రశ్నిస్తూ ఆర్ యు సింగిల్ అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్న విన్న నిహారిక ఒక్కసారిగా కంగు తింది. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి ఒక ఫోటోని షేర్ చేస్తూ నేను సింగిలేనా అంటూ తన భర్తకు ట్యాగ్ చేసింది.ఇక మరొక నెటిజన్ ఏకంగా తన ఫోన్ నెంబర్ అడగడంతో అది సీక్రెట్ అంటూ సమాధానం చెప్పారు.