Nagarjuna: వేలకోట్లకు అధిపతి… చీప్ గా ఆ హీరో జోబులో నుంచి దొంగతనం… ఇదేం అలవాటు నాగార్జున?

Nagarjuna : సినీ నటుడు నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఈయన సుమారు 5000 కోట్లకు అధిపతి అనే విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో సంపాదించిన హీరోలు ఎవరూ లేరని చెప్పాలి. ఇలా వేలకోట్లకు అధిపతి అయిన నాగార్జున ఒక స్టార్ హీరో నుంచి దొంగతనం చేసినట్లు తాజాగా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అసలు ఇన్ని వేల కోట్లకు అధిపతి అయిన నాగార్జున దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈయన ఏ హీరో జోబులో నుంచి డబ్బు దొంగతనం చేశారు అనే విషయానికి వస్తే…

నాగార్జున త్వరలోనే కుబేర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాలో రష్మిక ధనుష్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా నాగార్జునను యాంకర్ సుమ ప్రశ్నలు వేశారు. మీరు చిన్నప్పుడు ఎవరి జోబులోనుంచైనా దొంగతనం చేశారా అంటూ ప్రశ్న వేయడంతో నాగార్జున చేశానని తెలిపారు.

చిన్నప్పుడు నేను నాన్న నాగేశ్వరరావు గారి జోబులో నుంచి డబ్బులు దొంగతనం చేశానని తెలిపారు. నేను మా నాన్న పర్సులో నుండి దొంగతనం చేశాను కానీ నా కొడుకులిద్దరూ నా పర్సులో నుండి ఎప్పుడు దొంగతనం చేయలేదని చెప్పారు.ఎందుకలా అని అంటే..ఎందుకంటే నేను వ్యాలెట్ మెయింటైన్ చేయను కాబట్టి అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు అయితే చిన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి తల్లి లేదా తండ్రి నుంచి ఇలా డబ్బులను దొంగతనం చేస్తూ చిలిపి పనులు చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి మంచి జ్ఞాపకాలని చెప్పాలి.