మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో “RRR” మెంటల్ మాస్ గ్లింప్స్..!

మొత్తం పాన్ ఇండియన్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) గ్లింప్స్ ఇప్పుడు ఎట్టకేలకు చిత్ర యూనిట్ ఎలాంటి లేట్ లేకుండా అనుకున్న సమయానికి రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియో ఎలా ఉందంటే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అందరూ రాజమౌళి పెట్టుకున్న అంచనాలను మాచ్ చేసే విధమైన అదిరే విజువల్స్ తో దీన్ని తీర్చిదిద్దారు. ఉండడానికి 40 సెకండ్స్ మాత్రమే ఉన్నా భీకర యాక్షన్ సీక్వెన్స్ లు భారీ విజువల్స్ తో రాజమౌళి దాన్ని నింపేసారు.

RRR Glimpse - NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | SS Rajamouli | 7 Jan 2022

రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై చూపిన విజువల్స్ పులితో పోరాట సన్నివేశాలు కానీ గడ్డి లోనుంచి జ్వాలా బాణం దూసుకెళ్లే సీన్ కానీ ప్రతిదీ మెంటల్ మాస్ గా ఉన్నాయి. ఇంకా అజయ్ దేవగన్ పాత్ర కూడా సినిమాలో ఎంత కీలకమో ఇందులో కనిపిస్తుంది. ఇక దీనికే ఇలా ఉంటే తర్వాత వచ్చే టీజర్, ట్రైలర్ లు ఏ స్థాయిలో ఉంటాయో వాటికన్న మించి సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే జనవరి 7 వరకు ఆగాల్సిందే. ఇంకో మాట ఈ వీడియోలో కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దీనిని ఇంకో స్థాయిలో నిలబెట్టింది.