Megastar Is Back : మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనేక సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకదాని తర్వాత ఇంకో భారీ ప్రాజెక్ట్ ఇలా ఒకదాన్ని మించి ఒకటి ప్లాన్ చేస్తూ వరుసగా ఏకకాలంలో వాటిని కంప్లీట్ చేస్తూ వెళ్లిపోతున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ మెగాస్టార్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అంటే మధ్యలో కరోనా దానికి బ్రేక్ వేసింది.
మెగాస్టార్ తాను కరోనా పాజిటివ్ అయ్యినట్టుగా చెప్పి షాకిచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఆ తర్వాత చిరు ఎదుర్కొన్న పరిస్థితులు మరింత దారుణం అని చెప్పాలి. తన తల్లి పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొనలేకపోయారు. మరి ఇప్పుడు ఎట్టకేలకు తాను కరోనా నెగిటివ్ అయ్యినట్టు కన్ఫర్మ్ చేసి పొద్దున్నే అదిరిపోయే వార్త ఇచ్చారు.
మరి చిరు కి ఇలా తగ్గిందో లేదో వెంటనే తన సినిమా దర్శకులు అందరిని ఒక దగ్గ కూర్చోబెట్టి తన సినిమాల ప్లానింగ్ కోసం చెప్తున్నట్టు ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇందులో దర్శకుడు బాబీ, మెహర్ రమేష్, నటుడు బ్రహ్మాజి తదితరులు కనిపిస్తున్నారు.
మరి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే ఆల్రెడీ చిరు సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఇదంతా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న “గాడ్ ఫాదర్” సెట్స్ నుంచే జరిగింది. మొత్తానికి మాత్రం తన ఆరోగ్యం ఆగయ్యక చిరు ఎక్కడా తగ్గేలా లేరని చెప్పాలి.
https://twitter.com/KChiruTweets/status/1490166110523899904?s=20&t=KVOVtLlg-lIEplKYH4Az8w
