ఎలిమినేషన్ పేరుతో గత శనివారం హౌస్ నుండి బయటికి వెళ్లినట్టే వెళ్లి సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబోని గురువారం ఎపిసోడ్‌లో హౌస్‌లోకి ప్రవేశపెడుతున్నారు. ఇన్ని రోజులూ సీక్రెట్ రూమ్‌లోంచి హౌస్‌ని పరిశీలించిన లోబో, హౌస్‌లో తన గేమ్ స్ర్టాటజీని ఖచ్చితంగా మార్చుకోవడానికి అవకాశముంది.
గతంలోనూ ఇలా సీక్రెట్ రూమ్‌లో నుంచి వచ్చిన కంటెస్టెంట్లకు అదే ప్లస్ పాయింట్ అయ్యింది. అయితే, లోబో ఆ ప్లస్ పాయింట్స్‌ని యూజ్ చేసుకుంటాడో లేదో కానీ, సీక్రెట్ రూమ్‌లో ఉన్న తనకు కొంతమంది నిజ స్వరూపాలు మాత్రం బాగా అర్ధమయ్యాయని చెప్పొచ్చు.
ఎవరు జెన్యూన్, ఎవరు ఫేక్ అనేది క్లియర్‌గా అర్ధమై ఉంటుంది. లోబో తిండి గోల విషయమై యానీ మాస్టర్, యాంకర్ రవి తదితరులు ఓ సందర్భంలో సీరియస్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఆ ఢిస్కషన్ లోబోని బాగా గాయపరిచి ఉంటుందని ఆయన హావభావాల ద్వారా అర్ధం చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇష్యూస్‌ని మనసులో పెట్టుకున్న లోబో, రీ ఎంట్రీలో ఎవర్ని.. ఎలా.? ట్రీట్ చేస్తాడనేది చూడాలిక.