Rajamouli: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. ఈయన తన స్నేహితుడిని గత కొద్ది సంవత్సరాలగా టార్చర్ పెడుతున్నారని ఆయన టార్చర్ భరించలేక తాను చనిపోతున్నాను అంటూ రాజమౌళి ప్రాణ స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాస్ రావు ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన మరణ వాంగ్మూలం తెలియజేశారు.
ఇలా సెల్ఫీ వీడియోతో పాటు మరో లెటర్ కూడా ఆయన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఒక అమ్మాయి కారణంగా మా మధ్య వివాదం వచ్చిందని, రాజమౌళి కోసం నేను ఆ అమ్మాయిని త్యాగం చేసి ఇప్పటికీ కూడా ఒంటరిగానే బతుకుతున్నానని తెలిపారు. ఇలా ఈ విషయం వల్లే ఇద్దరి మధ్య గొడవ రావడంతో రాజమౌళి నాకు టార్చర్ పెడుతున్నారని శ్రీనివాస్ తెలిపారు.
ఇక ఈ వీడియోలో ఆయన మరిన్ని షాకింగ్ విషయాలను కూడా వెల్లడించారు. రాజమౌళి సినిమాలు ఇలా సక్సెస్ అవుతున్నాయి అంటే కారణం క్షుద్ర పూజలే అంటూ శ్రీనివాస్ తెలిపారు. రాజమౌళి తన సినిమాలను సక్సెస్ చేసుకోవడం కోసం అలౌకిక శక్తులను ఉపయోగిస్తున్నారని ఈ వీడియోలో వెల్లడించారు. ఇలా రాజమౌళి సినిమాలో సక్సెస్ వెనుక క్షుద్ర పూజలే కారణమని ఈయన చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి.
ఇక శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలపై చాలామంది స్పందిస్తూ అసలు ఈయన మానసికంగా ఒత్తిడిలో ఉన్నారా? లేక కావాలని రాజమౌళిని టార్గెట్ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఆధారాలు లేనివి కావడంతో ఈయన కేవలం వ్యక్తిగత కక్ష లేదా బాధతో చేసిన ఆరోపణ అని భావిస్తున్నారు. ఒక టాలీవుడ్ దిగ్గజ దర్శకుడిపై ఇలాంటి విమర్శలు రావడం ఇదే మొదటిసారి కావడంతో సినీ పరిశ్రమ కేవలం ఈ విషయాన్ని ఆసక్తికరంగా గమనిస్తున్నారు తప్ప ఎవరూ కూడా స్పందించలేదు ఇక రాజమౌళి కూడా ఈ విషయంపై ఇప్పటివరకు ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం.