వైరల్ టాక్ : అదిరే మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న కొరటాల శివ.!

Koratala Siva Planning A Superb Multi Starrer In Tollywood | Telugu Rajyam

తన సినిమాలతో బ్లాక్ బస్టర్ అనే పేరుని తన ముందు పెట్టేసుకున్న దర్శకుడు కొరటాల శివ. అలాగే తన “జనతా గ్యారేజ్”, లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో “ఆచార్య” అనే ఇంకో భారీ మల్టీస్టారర్ చిత్రాలను చేశారు. అందుకే కొరటాల మల్టీ స్టారర్ అంటే మినిమమ్ అంచనాలు, గ్యారెంటీ ఏర్పడింది. ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా ఎన్టీఆర్ తో ఇంకో సినిమా కొరటాల ప్లాన్ చేశారు.

దీని తర్వాతనే ఓ సాలిడ్ మల్టీ స్టారర్ ని ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో ఓ టాక్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోలు ఎవరంటే ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు కాగా ఇంకో హీరో నందమూరి నటసింహం బాలయ్య అట. ఈ కాంబో అంటేనే మంచి ఎనర్జిటిక్ గా ఉంది మరి నిజంగానే ఈ కాంబోలో సినిమా ఉందో లేదో అనేది తెలియాలి అంటే ఇంకొంత కాలం వెయిట్ చెయ్యాల్సిందే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles