బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కి మంచి స్టఫ్ దొరికింది. బాలీవుడ్ ముచ్చట్లే కాదు, టాలీవుడ్ ముచ్చట్లలోనూ వేలు పెట్టేస్తోంది. ఇటీవల జరిగిన సమంత, నాగచైతన్యల విడాకుల ఇష్యూలో దూరేసి, తనదైన స్టైల్‌లో నోటికి పని చెప్పేసింది. ఆ ఇష్యూను బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌కి లింకు పెట్టేసి రచ్చ చేసేసింది.
ఇక తాజాగా బాలీవుడ్‌లో బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆ విషయమై బాలీవుడ్ ప్రముఖులంతా బాద్‌షాకు అండగా నిలబడుతున్న సంగతీ తెలిసిందే. ఎలాగోలా తన కొడుకును బయటకి తెచ్చుకోవాలని షారూఖ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న కంగనా, అప్పుడెప్పుడో జాకీచాన్ కొడుకు కూడా ఇలాగే అరెస్ట్ అయితే, అందరికీ ఆయన క్షమాపణలు చెప్పాడనీ, శిక్ష అనుభవించేవరకూ తన కొడుకును బయటికి తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదనీ గుర్తు చేసింది. అంటే, షారూఖ్ కూడా అలాగే చేయాలని ఆమె ఉద్యేశ్యమా.?
ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆర్య కూడా శిక్ష అనుభవించాలన్నదే ఆమె ఇన్నర్ ఫీలింగా.? అంటూ బాద్‌షా అభిమానులు గుస్సా అవుతున్నారు. పబ్లిసిటీ స్టంట్ కోసం కంగనా ఇంతలా దిగజారిపోతుందా.? అని నెటిజన్లు సైతం కంగనాపై విరుచుకుపడుతున్నారు.