రెండు మూడు నెలల చర్చలు జరిపిన అంతరం apsrtc తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తెలంగాణలో రెండు లక్షల 60 వేల కిలోమీటర్లు తిరిగే apsrtc బస్సులు ఇప్పుడు కేవలం ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లకు పరిమితం కాబోతుంది. దీనివలన apsrtc కి 300 కోట్లు మేర నష్టం కలగనుంది, దానిని ఎలాగోలా పూడ్చుకోవటానికి జగన్ సర్కార్ నడుము బిగించింది.
విజయవాడ-విశాఖ రూట్ తీసుకుంటే.. ఇప్పటివరకు ఏపీఎస్ఆర్టీసీ ఈ లైన్లో రోజూ 107 సర్వీసులు నడిపేది. ప్రైవేట్ ట్రావెల్స్ 117 సర్వీసులు నడిపేవారు. ప్రైవేట్ సర్వీసులతో పోల్చి చూస్తే ఏపీఎస్ఆర్టీసీ లో రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి మొదటి ప్రాధాన్యత వీటికే ఇచ్చేవాళ్ళు , కాకపోతే బస్సులో సీట్లు లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తారు. ఆర్టీసీ కంటే ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ తిరుగుతున్నాయంటే అక్కడ డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంత డిమాండ్ ఉన్నా కూడా.. అధికారుల ఉదాసీనత, బస్సులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోయింది.
విశాఖ పాలనా రాజధానిగా పూర్తిస్థాయిలో రూపాంతరం చెందితే.. విజయవాడ-విశాఖ సర్వీసుల్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. అటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి న్యాయరాజధాని కర్నూలు వెళ్లే బస్సుల్ని కూడా పెంచాలి. తెలంగాణకు పంపించాల్సిన బస్సుల సంఖ్యను తగ్గించి వాటిని విజయవాడ నుండి విశాఖకు , అటు కర్నూల్ కు పంపించే విధంగా ఆర్టీసీ కార్యాచరణ సిద్ధం చేస్తుంది.
అయితే ఆంధ్ర లో ప్రైవేట్ ట్రావెల్స్ హవా ఎక్కువ, వాటి లాభం కోసమే ఆర్టీసీని నిర్లక్ష్యం చేశారనే మాటలు కూడా గతంలో వినిపించాయి. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వ కఠిన నిర్ణయాలు తీసుకోని ప్రైవేట్ ట్రావెల్స్ కు చెక్ పెడితే కానీ ఆర్టీసీ బ్రతుకుతుంది, అదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి నడపాలి. క్షేత్ర స్థాయి నుండి ఇవన్నీ పక్కగా జరిగితేనే ఏపీఎస్ఆర్టీసీ బ్రతుకుంది, లేకపోతే దానిని కాపాడటం ఎవరి వల్ల కూడా కాదు