Effects Of Alcohol: ప్రతిరోజు మద్యం సేవించటం ఆరోగ్యానికి మంచిదేనా..?

Effects Of Alcohol: ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా మద్యపానానికి బాగా అలవాటు పడిపోయారు . పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఎక్కువగా ఆల్కహాల్ కి బానిస అవుతున్న వ్యక్తులు కోకొల్లలు. అయితే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుందని అందరికీ తెలుసు. రోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతింటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆల్కహాల్ అధికంగా తీసుకునేవారిలో లివర్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీనివల్ల ఆరోగ్య సమస్యలతో పాటు ఆరోగ్యానికి కూడా కొంత వరకు మేలు చేస్తుందని కొందరి విశ్వాసం . అవేంటో ఒకసారి చూద్దాం.

మన కల్చర్ ప్రకారం మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఆల్కహాల్ సేవిస్తుంటారు. వ్యవధిలోనే ఆల్కహాల్ సేవించే స్త్రీలలో చాలా తక్కువ వ్యవధిలోనే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ మానవ శరీరం మీద అనేక మార్పులు తీసుకొస్తుంది. ఇది మెదడులో డోపమైన్ అనే మాలిక్యు లను విడుదల చేస్తుంది.

ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యం అదే అమితంగా తీసుకుంటే అనారోగ్యం. విస్కీ, రెడ్ వైన్, డార్క్ లిక్కర్ వంటివి సేవించడం వల్ల హ్యాంగోవర్ సమస్యలు తలెత్తుతాయి. ఆల్కహాల్ కు దూరంగా ఉండటం వల్ల దాదాపు 30 శాతం వరకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది. పడకడుపునే లేదా లేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకుంటే 3 శాతం ఎక్కువగా మత్తెక్కుతుంది. అదే ఫుడ్ తో పాటుగా ఆల్కహాల్ తేసుకుంటే ఆలస్యంగా మత్తు ఎక్కుతుంది.

మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వత్తిడి తగ్గి , జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఇష్టమైన ఆహారాన్ని కొంత ఆల్కహాల్ తో కలిపి తీసుకుంటే ఆయుషు కూడా పెరుగుతుంది. కానీ ఆల్కహాల్ ఎక్కువగా తాగటం వల్ల గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి. ఆల్కహాల్ తీసుకునే ముందు నీరు ఎక్కువగా తాగటం మంచిది .