పుట్టిన పసిపిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతి తెలిసిందే. ఏ మాత్రం తప్పు చేసినా పిల్లల ఆరోగ్యానికే ప్రమాదం అని చెప్పవచ్చు. వేసవి కాలంలో చిన్న పిల్లలను బాగా చూసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎందుకంటే సాధారణ మనుషులే ఎండ దెబ్బకు అల్లాడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. చిన్న పిల్లలకు నీళ్ల రూపంలో ఏవో ఒకటి ఇవ్వడం మంచిది.
కాచి చల్లార్చిన నీటిని చిన్న సీసాలో పోసి చంటి పిల్లలకు తాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పంచదార, ఉప్పు కలిపిన నీరు తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్ కలుగుతాయి. పిల్లలకు అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు, నిమ్మ రసం తాగిస్తూ ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
5 లేదా 6 నెలల పిల్లలకు తినగలిగిన పళ్ళను ఆహారంగా పెట్టడం ద్వారా మాములుగా కంటే వేసవి కాలంలో ఎక్కువగా పళ్లను తింటే మంచిది కరక్కాయను అరగతీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తల నొప్పి, కళ్ల మంటలు తగ్గే అవకాశం ఉంటుంది. పసిపిల్లలకు ఆరు నెలల వరకు నీళ్లను ఎక్కువగా నీళ్లను తాగించడం మంచిది కాదు. పసిపిల్లల విషయంలో తప్పు చేస్తే వాళ్లకు కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయి.
పసిపిల్లల ఆరోగ్యం విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది. పిల్లల కోసం ఉన్న ప్రత్యేక ఆస్పత్రులలో పిల్లలకు వైద్య చికిత్స అందిస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను అందించడం మంచిదని చెప్పవచ్చు.