హాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ‘టైటానిక్’, ‘వింబుల్డన్ , ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూశారు. గాయని బార్బరా డిక్సన్ సోమవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
‘టైటానిక్’లో కెప్టెన్ ఎడ్వర్డ్ జే స్మిత్ పాత్రతో ఎనలేని గుర్తింపు పొందారు. నటనపై మమకారంతో థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్న బెర్నార్డ్ తర్వాత టీవీ షోలతో అలరించారు. తదుపరి హాలీవుడ్ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నారు. ‘వోల్ఫ్ హాల్’ అనే సినిమాతో వెండితెరపై తన సత్తా చాటిన ఆయన అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదు. హాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్ సాధించిన ఎన్నో చిత్రాల్లో ఆయన భాగమయ్యారు.
1975లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన 50కి పైగా చిత్రాలు, టీవీ రంగంలో 60కి పైగా షోలతో అలరించారు, యాక్టర్స్ గిల్డ్, బాటాలాంటి అవార్డులకు నామినేట్ అయ్యారు. బెర్నార్డ్ హిల్ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, ఆయన నటనని కొనియాడుతూ సోషల్ విూడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చివరిసారిగా గతేడాది; ‘ఫరెవర్ నౌ’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు.