సత్య మూవీ అచ్చమైన తెలుగు సినిమా లా ఉంటుంది: నిర్మాత శివమల్లాల

తమిళంలో హిట్ కొట్టిన రంగోలి మూవీ తెలుగులో మే 10న సత్య గా విడుదల కాబోతోంది. హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన రంగోలి సినిమాని శివం మీడియా పై శివమల్లాల గారు నిర్మాతగా తెలుగులో తీసుకొస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలు.

ఈ సినిమా ఎలా ప్రారంభమైందంటే?
నేను చెన్నై వెళ్ళినప్పుడు నా స్నేహితుడి ద్వారా సతీష్ గారు పరిచయమయ్యారు. ఆయన తమిళ్ నిర్మాత హీరో హమరేష్ కి తండ్రి. ఆయనతో పెరిగిన స్నేహం కొద్దీ తెలుగులో మీ రివ్యూలు బాగుంటాయి అని ఈ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ వేయించి నాకు చూపించారు. సినిమా చూసిన తర్వాత బాగా కనెక్ట్ అయ్యాను కానీ క్లైమాక్స్ ఎక్కలేదు. దాదాపు 45 నిమిషాల పాటు డైరెక్టర్ తో క్లైమాక్స్ గురించి వాదించాను. సతీష్ గారికి క్లైమాక్స్ బాలేదండి సినిమా అంతా బాగుంది అని చెప్పాను. అది ఇంకా రఫ్ వెర్షన్ మాత్రమే. మళ్లీ రెండు నెలల తర్వాత కాల్ చేసి సినిమా రిలీజ్ కి అక్కడున్న పెద్ద దర్శకులు నిర్మాతలతో మళ్లీ చూపించారు. సినిమా గురించి మాట్లాడమని నన్ను స్టేజ్ పైకి ఆహ్వానించారు. అప్పుడే ఈ సినిమాని తెలుగులో నేను రిలీజ్ చేస్తాను అని అనౌన్స్ చేయడం జరిగింది. అలా ఈ సినిమా నాకు ఒక బేబీ లాగా అయిపోయింది. ఈ సినిమా డబ్బింగ్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా 12 లక్షలు ఖర్చు పెట్టాం. అచ్చమైన తెలుగు సినిమా లాగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం.

మీరు ఇప్పటివరకు చాలా భాషల్లో సినిమాలు చూశారు ఈ డైరెక్టర్ పైన మీ అబ్జర్వేషన్ ఏంటి?
నాకు ఈ డైరెక్టర్ ముందు నుంచి పరిచయం. వాలి డైరెక్ట్ చేసిన ఒక సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను. నవీన్ చంద్ర, అమృత అయ్యర్ యాక్ట్ చేసిన మూవీ మరియు ప్రకాష్ రాజు గారు కూడా అందులో ఒక పార్టనర్. ఒకరోజు రామాయణంలో షూట్ జరుగుతున్నప్పుడు 6 మినిట్స్ సీన్ ని చాలా బాగా హ్యాండిల్ చేసి తీసాడు. అది చూసిన వెంటనే అతనికి ₹2,000 అడ్వాన్స్ ఇచ్చి నా నెక్స్ట్ సినిమా నీతోనే అని చెప్పినప్పుడు నన్ను ఒకరు నమ్మారు అని అతని కళ్ళల్లో వచ్చిన నీళ్లు. మంచి పనితీరు ఉన్న దర్శకుడు వాలి. తెలుగులో నిహారిక తో ఒక సినిమా తమిళం మలయాళం లో ఒక సినిమా చేస్తున్నాడు. మొత్తం నాలుగు ప్రాజెక్టులు హ్యాండిల్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. సినిమా పైన చాలా పాషన్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా తను కూడా డబ్బు కోసం కాకుండా శివ మల్లాల అని నాకోసం ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు ఆయన సినిమా చేశాక వేరే చేస్తానని తనకు మంచి ఆఫర్ వచ్చినా వదులుకొని నాకోసం సినిమా చేయడానికి ముందుకు వస్తున్నాడు.

ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు?
సీడెడ్ అయితే 28 థియేటర్లు డబ్బింగ్ సినిమాకి అది చాలా ఎక్కువ థియేటర్ల కింద లెక్క. ఇక్కడ మటుకు నేనే డిస్ట్రిబ్యూటర్ గా పివిఆర్, ఐనాక్స్, సినిమాక్స్ లాంటి థియేటర్స్ మాట్లాడుకుని ఏ విధంగా విడుదల చేయాలో నేనే ప్లాన్ చేసుకొని చేస్తున్నాను.

3000 జీతం నుంచి కష్టపడి ఈ స్థాయికి ఎదిగి సంపాదించిన డబ్బు ఎంత ఇలా సినిమా పైన పెట్టడం రిస్క్ అనిపించలేదా?
హీరో చూడడానికి ధనుష్ లాగా జీ.వి. ప్రకాష్ లాగా ఉన్నాడని అందరూ అనడం. అదేవిధంగా ఈ సినిమాని అక్కడ రెడ్ జైంట్ ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేయడం. అమెజాన్ వాళ్ళు ఈ సినిమా రైట్స్ అడగడం ఇప్పుడు తెలుగు రైట్స్ నా దగ్గర ఉండడం ఈ సినిమాకి ప్లస్. అదేవిధంగా పబ్లిక్ లో కూడా ఇంస్టాగ్రామ్ లో దాదాపు 2 మిలియన్ మంది రంగోలి 2 ఎప్పుడు అని పోస్టులు పెడుతున్నారు. అంత హైప్ ఉన్న సినిమాని తెలుగులో నేను నిర్మిస్తూ ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.

తమిళ్ వెర్షన్ కి తెలుగు వర్షన్ కి ఏమన్నా మార్పులు చేర్పులు చేశారా?
అదృష్టం ఏంటంటే రెండు వర్షన్స్ కింద క్లైమాక్స్ ని ముందే డైరెక్ట్ చేసి పెట్టుకున్నారు. తమిళ్ క్లైమాక్స్ అంత వర్కౌట్ అవదు తెలుగులో అని సతీష్ గారితో అన్నప్పుడు తెలుగులో క్లైమాక్స్ రీ షూట్ చేద్దాం అన్న అన్నిటికీ ఓకే అన్నారు. కానీ ఆ 5 మినిట్స్ క్లైమాక్స్ వెర్షన్ ముందే షూట్ చేసి ఉండటం వల్ల దానికి ప్రాపర్ డబ్బింగ్ చెప్పించి తెలుగులో క్లైమాక్స్ మార్చి తీసుకొస్తున్నాం.

ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది?
ఈ సినిమాకి హైలెట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. గవర్నమెంట్ స్కూల్ లో చదువుకునే స్టూడెంట్ ని తీసుకెళ్లి బావి లాగా ఉండే ప్రైవేట్ స్కూల్లో వేస్తే. ఆ తండ్రికి కొడుక్కి మధ్య జరిగిన సిచువేషన్స్ చాలా బాగుంటాయి.

ఈ సినిమాలో చదువు గురించే చెప్తున్నారా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయా?
ఈ సినిమాలో చదువు ఒకటి ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ అనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి ఫ్రెండ్షిప్ ఉంటుంది. నార్మల్ గా నేను సినిమా చూసి బాలేక పోతే బాలేదు లైట్ తీసుకోండి అని చెబుదామనుకున్నా కానీ కొత్త కుర్రాడు అయినా హమరేష్ చాలా బాగా నటించాడు.

ఈ సినిమాలో సాంగ్స్ ఎలా ఉంటాయి?
తమిళంలో సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. తెలుగులో కూడా రాంబాబు గోసాల గారు రాసిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. యాక్చువల్ గా ఈ డబ్బింగ్ గాని సాంగ్స్ గాని ఇంత బాగా రావడానికి కారణం ఇంచార్జ్ విజయ్ గారు అలాగే లిరికరేటర్ రాంబాబు గోసాల గారు. హీరో డబ్బింగ్ చెప్పేటప్పుడు కొంచెం తమిళ్ ఫ్లేవర్ వస్తుంది అంటే కూడా సతీష్ గారు సరే తెలుగు వాళ్ళతోనే చూపించండి అని చెప్పడం. అందరూ కూడా ఈ సినిమా విషయంలో పాజిటివ్ గా ఉండడం అదే సినిమాకి ప్లస్.

చివరగా నిర్మాత శివ మల్లాల గారు మాట్లాడుతూ ఈ సినిమా కోసం నన్ను సపోర్ట్ చేసిన దిల్ రాజు గారికి అదేవిధంగా మొన్న పిలవగానే ఈవెంట్ కి వచ్చిన దర్శకులకి, ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.