వినికిడి లోపం సమస్యతో బాధ పడుతున్నారా… ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలివే!

మన దేశంలో చాలామంది వినికిడి లోపం సమస్యతో బాధ పడుతున్నారు. కొంతమంది చెవుడు సమస్య దూరం కావడానికి వినికిడి పరకరాలు వాడుతుండగా మరి కొందరు మాత్రం ఆ సమస్య కోసం చికిత్స తీసుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. వేర్వేరు కారణాల వల్ల వినికిడి లోపం సమస్య వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

వినికిడి సమస్య ఉంటే ఇతరులు మాట్లాడే సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వినికిడి మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి రావచ్చు. భారీ శబ్దాలు వినడం, జన్యు సమస్యలు, అనారోగ్య సమస్యలు, నాడీ సంబంధిత రుగ్మతలు, కొన్ని రకాల ఔషధాలు, గాయాలు ఈ సమస్యకు కారణమవుతాయి.

వినికిడి సమస్యతో బాధ పడేవాళ్లు బీ12 ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇనుము , కాల్షియం అధికంగా తీసుకోవడం . విటమిన్ డి, తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను కొంతమేర అధిగమించడం సాధ్యమవుతుంది. వ్యాయామం మితంగా చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు సులభంగా దూరమవుతాయి.

ధూమపానంకు దూరంగా ఉండటం, తగినంత నిద్ర లేకపోవడం, పెద్ద శబ్దాలను నివారించడం, వినికిడి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యలను కొంతవరకు అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుంది. శాశ్వతంగా చెవుడు రకాముందే వైద్యులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యకు తాత్కాలికంగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.