ఇంట్రెస్టింగ్ అప్డేట్ : “RRR” గ్లింప్స్ ఇలా ఉండబోతుందా..?

ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొల్పుకున్న చిత్రాల్లో రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం “ట్రిపుల్ ఆర్(RRR)”. దర్శక దిగ్గజం రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కించిన సినిమా ఇది. మరి ఈ చిత్రం నుంచి ఈరోజు గ్లింప్స్ రిలీజ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా అంచనాలుతో దాని కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దీనిపై ఇంట్రెస్టింగ్ సమాచారం ఇప్పుడు వినిపిస్తోంది.

ఈ వీడియోలో అదిరే విజువల్స్ ఈ వీడియోలో ఉంటాయట. సీతారామరాజు గా చరణ్ పై విల్లు పట్టుకున్న విజువల్స్ అలాగే కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పులితో ఉండే సాలీడ్ సీక్వెన్స్ విజువల్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే భారీ గ్రాఫికల్ సన్నివేశాలు కూడా ఉంటాయట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇందులో ఇద్దరు హీరోలపై విజువల్స్ ఉంటాయి కానీ ఇద్దరూ కలిపి అయితే ఒకే ఫ్రేమ్ లో ఉండరట. ఇదైతే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. మరి ఇవన్నీ ఉంటాయా లేదా అన్నది తెలియాలి ఇంకాసేపు ఆగితే తెలుస్తోంది.