Allu Arjun: కన్నడ మీడియాకు సారీ చెప్పిన ‘ఐకాన్ స్టార్’

'Icon star' Allu Arjun apologizes to Kannada media

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్నడ మీడియా రిపోర్టర్లను క్షమించమని కోరారు. వివరాలలోకి వెళితే… దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ డిసెంబర్ 17న థియేటర్లలోకి విడుదల కానుంది. దాంతో పుష్ప టీం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు బెంగళూరు లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే ప్రెస్ మీట్ ఉదయం 11.15 గంటలకు అని చెప్పి మీరు 1.15 గంటలకు రావటమేంటని కన్నడ రిపోర్టర్ ఒకరు అల్లు అర్జున్ ని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విన్న వెంటనే అల్లు అర్జున్ కన్నడ మీడియా ప్రతినిధులందరికి క్షమాపణ చెప్పారు. ఈ ప్రెస్ మీట్ సంగతి నాకు ఆలస్యంగా తెలిసిందని, వెంటనే ప్రైవేట్ జెట్ లో ఇక్కడికి వస్తున్నప్పుడు పొగ మంచు కారణంగా లాండింగ్ లేట్ అయ్యిందని వివరించారు. సారీ చెపితే మనిషి మరింత పెరుగుతాడే కానీ… తగ్గడని తనదైన శైలిలో డైలాగు వేసి నవ్వించారు.

Pushpa Bangalore Press Meet Live | Allu Arjun, Rashmika Mandanna | DSP | Sukumar

ఇక ఇదే సమావేశంలో హీరోయిన్ రష్మికకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. పుష్ప మూవీకి తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్న మీరు కన్నడలో ఎందుకు చెప్పలేదని అడగగా… మూవీ షూటింగ్ చాలా లేట్ గా కంప్లీట్ అయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ కోసం తెలుగు డబ్బింగ్ చెప్పానని, కేవలం సమయం లేనందునే కన్నడలో చెప్పటానికి కుదరలేదని వివరించారు. పుష్ప పార్ట్ 2 కి మాత్రం తప్పకుండా కన్నడలో డబ్బింగ్ చెప్తానని మాటిచ్చారు.