అక్కినేని నాగార్జునకు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నవమన్మధుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరు పదుల వయసులో కూడా నేటి తరం హీరోలకు దీటుగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న నాగార్జున కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా ఎన్నో బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ గా బుల్లితెర వ్యాఖ్యాతగా హీరోగా ఒక బిజినెస్ మెన్ గా అన్ని రంగాలలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోలు అనంతరం వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది యువ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు.హీరోగా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా బిజినెస్ మెన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరి టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎన్ని రకాల బిజినెస్ చేస్తున్నారు అనే విషయానికి వస్తే..

నాగార్జున హీరోగా నటిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను కూడా చేపట్టారు. అన్నపూర్ణ స్టూడియోకి నాగార్జున కో ఓనర్. స్టూడియో అనుబంధంగా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియాకి కూడా ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. అలాగే తన భార్యలతో కలిసి బ్లూక్రాస్ ఎన్జీవో సంస్థను నడిపిస్తున్న నాగార్జున ఎయిడ్స్ గురించి అవగాహన కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.