అనసూయ ఒక్కో షోకి ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా..?

బుల్లితెర మీద యాంకర్ గా చలామణి అవుతున్న లేడీ యాంకర్లలో అనసూయ కూడ ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా బుల్లితెర మీద సందడి చేస్తు మరొకవైపు నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. అనసూయ బుల్లితెర మీద ఎన్నో టీవీ షో లకి యాంకర్ గా వ్యవహరిస్తు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. అంతే కాకుండా తన గ్లామర్ షో తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. కొన్ని సందర్భాలలో ఆమె ధరించే దుస్తుల కారణంగా ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.

ఇదిలా ఉండగా నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఒక పాత్రలో నటించిన అనసూయ తన నటనతో అందరిని మెప్పించింది. అప్పటినుండి వరుస సినిమా అవకాశాలు రావడంతో సినిమాలలో కూడా నటిస్తు వెండితెర మీద తన సత్తా చాటుకుంటోంది. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్రలో నటించి మెప్పించిన అనసూయ అప్పటినుండి రంగమ్మత్తగా బాగా గుర్తింపు పొందింది. క్షణం సినిమాలో పోలీసాఫీసర్ గా వైవిధ్యమైన పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప సినిమాలో కూడా దాక్షాయని పాత్రలో నటించి అందరిని మెప్పించింది.

సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ అనసూయ బుల్లితెర మాత్రం వదలటం లేదు .ఇప్పటికీ పలు టివి షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటున్నారు. ఇక అనసూయ రెమ్యూనరేషన్ విషయం గురించి ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయ ఒక్కో టీవీ షో చేయడానికి ఒక ఎపిసోడ్ కి దాదాపు 2 నుండి 3 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ తోపాటు మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ అనే సింగింగ్ షో కి కూడా సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేస్తోంది. ప్రస్తుతం టీవి షో ల ద్వారా అనసూయ బాగానే సంపాదిస్తోందని తెలుస్తుంది.