Hiccups: తరచూ వెక్కిళ్ళు వస్తున్నాయా….వెక్కిళ్లు రావటం వెనుక కారణాలు ఇవే!

Hiccups:మానవ శరీరంలో ఆవలింత, ఎక్కిళ్ళు, తుమ్ము లాంటివి మనకు సంబంధం లేకుండా వాటంతట అవే జరిగే చర్యలు. ఇవి మన కంట్రోల్ లో లేకుండానే జరిగిపోతుంటాయి. ఎక్కిళ్ళు అందరికీ వచ్చిన అనుభవం ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటే,ఎక్కిళ్ళు వస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. కానీ శాస్త్రవేత్తలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి అన్న విషయం ఒక అధ్యయనంలో వివరించారు. మనకి ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా తగ్గించగలమో తెలుసుకుందాము.

మన శరీరంలో పొట్ట భాగాన్ని, ఛాతీ భాగాన్ని వేరు చేస్తూ ఒక పొర ఉంటుంది, దీనిని డయాఫ్రం అంటారు. ఈ డయాఫ్రం మన శ్వాస సమయంలో జరిగే ఉచ్వాస, నిచ్వాసల సమయంలో పైకి కిందకి కదులుతుంటుంది. ఇది గాలి పీల్చినప్పుడు కిందకి సాగి గాలిని ఊపిరితిత్తులకు అందేలాగా చేస్తుంది. అదేవిధంగా పైకి వచ్చి గాలి ని బయటకి పంపడంలో సహాయపడుతుంది.

ఒక్కొక్కసారి ఈ డయాఫ్రం కదలిక లో మార్పు సంభవించినప్పుడు మన ఊపిరి తో సంబంధం లేకుండా ఎక్కిళ్ళు వస్తాయి. డయాఫ్రం వేగంగా పైకి రావటం వల్ల లోపల ఉన్న గాలి స్వరపేటిక మీద ప్రభావం చూపి ఎక్కిళ్ళు శబ్దం వస్తుంది. ఇవి ఎక్కువగా కారం తో కూడిన ఆహారం, మసాలా ఆహారం తిన్నప్పుడు వస్తుంటాయి. సాధారణంగా మనిషిలో వత్తిడి, బాధ ఎక్కువ ఉన్న సమయంలో కూడా ఎక్కుల్లు వస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఎక్కిళ్ళు వచ్చినప్పుడు తరుచు చల్లటి నీరు తాగటం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఏదైనా షాక్ కి గురయ్యే విషయం చెప్పిన కూడా ఎక్కిళ్ళు ఆగిపోతాయట. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మీ శ్వాసను కాసేపు ఆపుతు వదులుతూ ఉంటే తగ్గుతాయి. ఎక్కిళ్ళు వచ్చేటపుడు కాసేపు మీ నాలుకని బయటకి పెట్టిన కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి. కొంతమంది పంచదారను కాసేపు నాలుక కింద ఉంచితే ఎక్కిళ్ళు తగ్గుతాయి అంటుంటారు. ఎక్కిళ్ళు తగ్గకుండా వస్తుంటే మాత్రం డాక్టర్ని సంప్రదించడం మంచిది. పైన తెలిపిన సూచనలు ఎక్కిళ్ళు తగ్గటానికి పెద్దవారు చెప్పిన మార్గాలు మాత్రమే. మీరు డాక్టర్ నీ సంప్రదించి వారి సూచనల మేరకు ఎక్కిళ్ళు తగ్గడానికి పరిష్కారం పాటించవచ్చు.