బాలయ్య “అఖండ” రిలీజ్ డేట్ అప్పటికి ఫిక్స్ అయ్యిందా..?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన మాస్ చిత్రం “అఖండ”. షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న ఈ భారీ చిత్రం రిలీజ్ కోసం బాలయ్య అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ ఆ డేట్ భాగ్యం మాత్రం ఇంకా దక్కలేదు.

అయితే ఇప్పుడు దీనిపై లేటెస్ట్ సమాచారం ఒకటి వినిపిస్తోంది. తాజా బజ్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ కాస్తా క్రిస్మస్ రేస్ కి చేంజ్ అయ్యినట్టు వినిపిస్తోంది. వచ్చే డిసెంబర్ 24న క్రిస్మస్ బరిలో బాలయ్య దిగబోతున్నట్టుగాయి ఇండస్ట్రీలో నయా టాక్. దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాలో శ్రీకాంత్ పవర్ ఫుల్ విలన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.