మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కి తన సినిమాలతో ఒక రేంజ్ బ్రేక్ ని ఇచ్చారు. అల వైకుంఠపురములో సినిమాతో అయితే పూజా కాళ్లకే సెపరేట్ క్రేజ్ ని తెచ్చి పడేసారు. మరి ఇప్పుడు ఎన్నో భారీ సినిమాలతో రెడీగా ఉన్న ఈ డస్కీ బ్యూటీ తన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్” పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రభాస్ తో చేసిన ఈ సినిమా చాలా బ్యూటిఫుల్ గా ఎంతో మెచ్యూర్ గా కనిపించే స్వచ్ఛమైన ప్రేమకథ లా ఉంటుందట. అంతేకాకుండా తన కెరీర్ లోనే ఇలాంటి ఒక అద్భుతమైన ప్రేమకథను కూడా చెయ్యలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో కథ ప్రతీ ఒక్క పాత్ర కూడా ఎంతో కడిలుస్తుంది అని యాడ్ చేసింది. మొత్తానికి మాత్రం ఈమె మాటల బట్టి సినిమా ఔట్ పుట్ చాలా నీట్ గా వచ్చినట్టే అనిపిస్తుంది. అదెలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే మరి.