Health Tips: చెవిలో గులిమి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

Health Tips: సాధారణంగా అందరికీ చెవిలో జిగురు రూపంలో గులిమి అనే పదార్థం ఉంటుంది. మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు వివిధ భాగాల నుండి బయటకు వచ్చినట్లు చెవిలో ఉండే కొన్ని పదార్థాలు గులిమి రూపంలో బయటకు వస్తాయి. చెవిలోపల కెరాటిన్ అనే ప్రోటీన్‌ చర్మంపై మరణించిన కణాలు, నూనె, కొలెస్ట్రాల్‌, సీక్వాలిన్ అనే పదార్థాలూ అన్నీ కలిసి గులిమిలా తయారవుతాయి. ఈ గులిమి ఉండటం వల్ల ప్రమాదమని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ ఈ గులిమి చెవికి రక్షణగా ఉంటుంది.

గాలి ద్వారా దుమ్ము ధూళి కణాలు బ్యాక్టీరియా వంటివి చెవి లోపలికి ప్రవేశించకుండా గులిమి అడ్డుగా ఉంటుంది. దుమ్ము ధూళి కణాలు చెవి లోపలికి ప్రవేశించకుండా వినికిడి మార్గాన్ని రక్షిస్తుంది. కానీ చాలామంది ప్రతిరోజు పిన్నులు, దూది పుల్లలు వంటివి పెట్టి చెవి లో ఉన్న గులిమి తీసుకుంటారు. ఇలా చేయటం చాలా ప్రమాదకరం. ఇలా చేస్తున్నప్పుడు చెవి లోపలి కర్ణభేరికి తగిలితే వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలా అని ఎక్కువ మోతాదులో గులిమి ఉండటం వల్ల కూడా వినికి సమస్య మొదలవుతుంది. పది లేదా పదిహేను రోజులకు ఒకసారి చెవిలో ఉన్న గులిమి శుభ్రం చేసుకోవాలి

తక్కువ మోతాదులో గులిమి ఉన్నప్పుడు నాణ్యమైన ఇయర్ బడ్స్ ను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. కానీ ఎక్కువ మోతాదులో గులిమి ఉన్నప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసుకొని నాననివ్వాలి.ఐదు నిమిషాల తర్వాత తల పక్కకు వంచి హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసేసిన తర్వాత నాణ్యమైన ఏర్పడుతూ నిమ్మదిగా చెవిని శుభ్రం చేసుకోవాలి. కానీ తరచూ చెవులు శుభ్రం చేయటం వల్ల వినికిడి సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది.