Health Tips: గంగపాయల ఆకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

Health Tips: ఆకుకూరలు కూరగాయలు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో ఉపయోగపడతాయి.మనం తీసుకునే రోజు వారి ఆహారంలో ఆకుకూరలు కూరగాయలు చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభించే ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రకృతిలో లో లభించే ఎన్నో రకాల ఆకుకూరలు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి. అటువంటి ఆకుకూరలలో గంగ పాయల ఆకుకూర కూడా ఒకటి. ఈ ఆకు కూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పొలం గట్ల మీద విరివిగా దొరికే గంగపాయల ఆకులో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఒమేగా ౩ ఫాటి ఆమ్లాలు, విటమిన్ A ,విటమిన్ బి పీచు పదార్ధాలు, ఐరన్ ,పొటాషియం ,కాల్షియంలతో పాటు యాంటి ఆక్సిడెంట్ లు కూడా ఈ ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి.మనం తీసుకునే ఆహారంలో అప్పుడప్పుడు ఈ ఆకుకూర చేర్చుకోవడం వల్ల శరీరంలో రక్త శాతం పెరుగుతుంది. విటమిన్ ఏ ఉండటంవల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు.

గంగ పాయల ఆకులో పొటాషియం, క్యాల్షియం లు ఉండటం వల్ల శరీరంలోని ఎముకలు, దంతాలు దృఢంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ ఆకు కూరలు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల అనేక రోగాల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. ఒమేగా 3 ఫాటి ఆమ్లాలు ఉండటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. ఈ ఆకు కూర లో ఉండే జింక్ ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది.ఈ

ఆకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.