ప్రభాస్ కెరీర్లో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి డేట్ ఫిక్స్.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో పలు భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటి తర్వాత కూడా మరిన్ని అదిరే సినిమాలు ప్రపంచ స్థాయిలో ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రతీ ఒక హీరో కెరీర్ లో మైలు రాయి ప్రాజెక్ట్ గా 25వ సినిమాను ప్లాన్ చేస్తారు.

అలానే ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లో 25వ ప్రాజెక్ట్ సెన్సేషనల్ సినిమాకి ఇప్పుడు ముహూర్తం కుదిరింది. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఆక్టోబర్ 7 న రాబోతున్నట్టుగా సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది కూడా ఆసక్తిగా మారిన అంశం. ప్రస్తుతానికి అయితే దర్శక ధీరుడు రాజమౌళి అలాగే సెన్సేషనల్ మాసివ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల పేర్లు ఈ సినిమాకి వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు ఫిక్స్ అవుతారు? లేదా కొత్త పేరు ఏమన్నా వస్తుందా అన్నది తెలియాలి అంటే ఏడో తారీఖు వరకు ఆగాల్సిందే..