Payal Rajput and Janhvi Kapoor : పాయల్ రాజ్‌పుత్‌కీ, జాన్వీ కపూర్‌కీ ఓ కామన్ పాయింట్ వుంది.. అదేంటో తెలుసా.?

Payal Rajput and Janhvi Kapoor : బాలీవుడ్‌లో వున్న జాన్వీకపూర్‌కీ, టాలీవుడ్ భామ, అందునా పంజాబీ బ్యూటీ అయిన పాయల్ రాజ్‌పుత్‌కీ కామన్ పాయింటా.? నో వే.. అంటారా.? వుందండీ. రిలేషన్‌షిప్, ఫ్రెండ్‌షిప్‌లాంటివేమీ కాదు కానీ, ఈ ఇద్దరికీ ఓ సినిమా లింకు వుంది.

జాన్వీకపూర్ తొలి సినిమా ‘ధడక్’. మరాఠీ సినిమా ‘సైరత్’‌కి అది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అదే సినిమాని పంజాబీలోనూ రీమేక్ చేశారు. ఆ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ అన్నమాట. మీ డౌట్ తీరిపోయిందిగా.

ఇద్దరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. పర్‌ఫామెన్స్ వైజ్ ఇద్దరూ ఇరగదీసేశారు. పంజాబీలోనూ, హిందీలోనూ కూడా ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయ్.

అయితే, పాయల్ రాజ్‌పుత్ మాత్రం ‘ఆర్ఎక్స్100’ సినిమాతో తెలుగులోకి డెబ్యూ చేసింది. తొలి సినిమాలో అమ్మడి స్కిన్ షో టాలెంట్ చూసి అంతా అవాక్కయిపోయారు. తొలి సినిమాకే బోల్డ్ బ్యూటీగా పాయల్ పేరు తెచ్చుకుంటే, జాన్వీ మాత్రం తొలి సినిమాతోనే తనలోని నటిని వెలికి తీసేసింది.

అలా అని, పాయల్ రాజ్‌పుత్‌ని తక్కువగా అంచనా వేయడానికి లేదండోయ్. బోల్డ్ క్యారెక్టరే అయినా, ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో పాయల్ పోషించిన పాత్ర ఏమంత ఆషా మాషీ కాదు. చాలా ఎక్స్‌పీరియన్స్ కావాలి. అందుకే బోల్డ్ అనే యాంగిల్ పక్కన పెట్టేసి చూస్తే, ఆ పాత్రకు ప్రాణం పోసేసింది పాయల్ రాజ్ పుత్. అదీ సంగతి.

ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ తెలుగులో మంచు విష్ణు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, జాన్వీ కపూర్ బోలెడన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో బాలీవుడ్‌లో బిజీగా వుంది. రేపో మాపో తెలుగులో డెబ్యూ చేసేందుకు ఎదురు చూస్తోంది.