Bigg Boss Finalist Manas: అందరూ అడుగుతున్నారు అంటూ అలాంటి ఫోటోలు షేర్ చేసిన మానస్.. ఫోటోలు వైరల్!

Bigg Boss Finalist Manas: ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటించి విశేషమైన ఆదరణ దక్కించుకున్న బుల్లితెర నటుడు మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మానస్ అనంతరం సీరియల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా పలు సీరియల్స్ ద్వారా ఎంతో క్రేజ్ కూడగట్టుకొని అదే క్రేజ్ కూడగట్టుకొని బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ ద్వారా మానస్ మరింత పాపులారిటీని దక్కించుకున్నారని చెప్పవచ్చు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు తన పద్ధతిలో తన గేమ్ ఆడటమే కాకుండా, పింకీ వ్యవహారం వల్ల కాస్త నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న మానస్ టాప్ ఫైవ్ లో టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా నిలబడ్డారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఎంట్రీ ఇచ్చి అనంతరం ప్రస్తుతం సినిమా అవకాశాలను దక్కించుకుంటారు.


మానస్ మాత్రం తనకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని తనకు ఒక ప్రొడక్షన్ హౌస్ నిర్మించి సినిమాలను చేయాలనేది తన కల అంటూ బిగ్ బాస్ హౌస్ లో తన కల గురించి తెలియజేశారు. ప్రస్తుతం అదే పనులలో మానస్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మానస్ ఫోటోలను షేర్ చేయమని నెటిజన్లు పదేపదే అడగడంతో తాజాగా మానస్ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.