షాకింగ్ : “పుష్ప” నుంచి మరో లీక్..ఈసారి ఏంటంటే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న భారీ సినిమా “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఆల్ మోస్ట్ సినిమా అంతా కంప్లీట్ అయ్యిపోవచ్చింది. కానీ అసలు ఈ సినిమా మొదలు అయ్యిన నాటి నుంచి కూడా లీక్స్ సమస్య మాత్రం ఎక్కడా వదలకుండా వస్తుంది.

సాంగ్స్ నుంచి సినిమా సన్నివేశాలు వరకు ఓసారి అయితే ఏకంగా 40 నిముషాలు సినిమానే లీక్ అయ్యింది అని టాక్ వచ్చింది. ఆ సమయంలో నిర్మాతలు కాస్త సీరియస్ కూడా అయ్యారు. కానీ ఈ లీక్స్ మాత్రం ఈ సినిమా నుంచి ఆగలేదు. ఇప్పుడు తాజాగా కూడా మరో లీక్ బయటికి వచ్చింది. ఈసారి కూడా ఓ మాస్ సాంగ్ వీడియో లీక్ అయ్యింది. సినిమా సెట్స్ లో అల్లు అర్జున్ డాన్స్ చేస్తున్న క్లిప్ ఇది. దీనితో ఇది కూడా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మరి ఈ లీక్స్ అన్నీ ఎప్పుడు ఆగుతాయో చూడాలి.