“మా”ఎన్నికల్లో మరో ఊహించని కుట్ర బయటపెట్టిన అనసూయ!

రీసెంట్ గానే టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా దగ్గర జరిగినటువంటి “మా” ఎన్నికలలో గెలిచి ఊహించని విధంగా ఓటమి పాలైన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో ఈ ట్విస్ట్ ఈ ఎన్నికల ఫలితాలపై సరికొత్త అనుమానాలను రేకెత్తించింది.

దీనితో గ్రామ స్థాయి రాజకీయాలు సినిమా పరిశ్రమలో కూడా మొదలయ్యాయి అని అంతా అనుకుంటుండగా అనసూయ మరో ఊహించని కోణం ఈ ఎన్నికల్లో జరిగిన కుట్రని బయటపెట్టినట్టు చేసింది.

“అంటే నిన్న ఎవరో ఎలక్షన్ రూల్స్ కి భిన్నంగా బ్యాలెట్ పేపర్స్ ని ఇంటికి కూడా తీసుకెళ్లారని.. ఆహా బయట టాక్ వచ్చింది” అని మరో అసలు విషయం బయటపెట్టింది. అంటే ఇక ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయో ప్రకాష్ రాజ్ ఎందుకు అంతలా నొచ్చుకొని రాజీనామా చేసే స్థాయి వరకు వెళ్లారో అన్నది కాస్త క్లియర్ అవుతుంది.