ఆ గ్రాండ్ షో ఫైనల్స్ కి గెస్ట్ గా బన్నీ? క్లారిటీ మీకోసం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారాడు. అయినా కూడా అల్లు అర్జున్ అంటే సరైన హెయిర్ స్టైల్ కి డ్రెస్సింగ్ కి మరీ ముఖ్యంగా వాటన్నిటి కంటే కూడా డాన్స్ కి అల్లు అర్జున్ పెట్టింది పేరు. తనకి ఇంత క్రేజ్ ఫాలోయింగ్ ఉంది అంటే తన డాన్సే ప్రధాన కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి అలాంటి అల్లు అర్జున్ మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై డాన్స్ తో ఫైర్ పుట్టించే అతి పెద్ద రియాలిటీ షో “ఢీ 13” ఫైనల్స్ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నట్టుగా ఓ టాక్ ఇపుడు వైరల్ అవుతుంది. అయితే ఇది వరకు ఓ సీజన్ కి గాను బన్నీ ఎప్పుడో గెస్ట్ గా వచ్చాడు. మరి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడా అనే దానిపై క్లారిటీ మీకోసం. నిజానికి ఈ షో ఫైనల్స్ కి బన్నీని పిలిచిన మాట నిజమేనట. కానీ వస్తాడా రాడా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇంకొన్ని రోజులు ఆగితే దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ రావొచ్చు.