Rajamouli: అప్పుడు బన్నీ… ఇప్పుడు జక్కన్న… ఆ తప్పే వారిద్దరికీ శాపంగా మారుతోందా?

Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్గా కూడా గుర్తింపు పొందారు. అయితే నిన్నటి నుంచి రాజమౌళి పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే ఈయన కారణంగా తన స్నేహితుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రాజమౌళి పెట్టే టార్చర్ నేను భరించలేనని అందుకే సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు.

ఇందులో భాగంగా నేను రాజమౌళి ఇద్దరు కూడా ఒకే అమ్మాయిని ప్రేమించాను రాజమౌళి కోసం నేను అమ్మాయిని త్యాగం చేసి ఇప్పటికే సింగిల్ గా ఉన్నాను కానీ ఈ విషయం నేను బయటకు చెబుతానన్న ఉద్దేశంతో రాజమౌళి నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టారు అంటూ రాజమౌళి గురించి ఒక వీడియో విడుదల చేశారు దీంతో రాజమౌళి వార్తలలో నిలిచారు. అయితే కొంతమంది ఈ వీడియో పై విమర్శలు కురిపించగా మరికొందరు ఈ వీడియో పై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

ఇలా రాజమౌళి గురించి ఆయన భార్య రమా గురించి ఒక వ్యక్తి లాంటి వ్యాఖ్యలు చేశారు అంటే తప్పనిసరిగా ఇది వారి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఈ ఘటనపై తప్పనిసరిగా రాజమౌళి కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది కానీ ఇప్పటివరకు జక్కన్న మాత్రం ఈ విషయంపై ఎక్కడ స్పందించలేదు. దీంతో పలువురు నేటిజన్స్ రాజమౌళి వ్యవహారంపై స్పందిస్తూ గతంలో అల్లు అర్జున్ చేసిన తప్పుని ఇప్పుడు రాజమౌళి కూడా చేస్తున్నారంటూ వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.

గతంలో కూడా అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లారు అయితే ఆయన ఓ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తూ సొంత ఫ్యామిలీని ని అవాయిడ్ చేస్తున్నాడు అని ప్రచారం చేశారు . అలాంటి వార్తలు ఎక్కువగా వినిపించిన మూమెంట్లోనే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యి ఇది కేవలం ఫ్రెండ్షిప్ అని చెప్పుటే అసలు ఈ సమస్యలు వచ్చేవి కాదు అల్లు అర్జున్ ఈ విషయంలో మౌనంగా ఉండడం వల్లే పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇప్పుడు రాజమౌళి పరువు ప్రతిష్ట లకు సంబంధించిన ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న రాజమౌళి మౌనంగా ఉన్నారు ఈయన కనుక ఈ విషయంపై స్పందించకపోతే తదుపరి మరిన్ని పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ విషయం ఆయన స్టార్ డమ్ ను దెబ్బ తీసే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు మరి ఈ ఘటనపై జక్కన్న రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.