టాక్ : బాలయ్య “అఖండ” ఓటిటి డీల్ పూర్తి ఎవరికంటే.?

నందమూరి వారి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “అఖండ”. బాలయ్య అలాగే బోయ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ తెలియడం లేదు కానీ సినిమా డిజిటల్ హక్కుల డీల్ పూర్తి అయ్యిపోయినట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

దీని ప్రకారం మొదటి నుంచి వినిపిస్తున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లే ఈ చిత్రం ఓటిటి హక్కులు దక్కించుకున్నారట. అంతేకాకుండా భారీ మొత్తంలోనే దీనికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సో అఖండ రిలీస్ తర్వాత హాట్ స్టార్ లో మనం ఈ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ద్వారకా క్రియేషన్ వాళ్ళు నిర్మాణం అందిస్తున్నారు.